వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల మండలి సభ్యుడు డీఏ సోమయాజులు ఆదివారం తెల్లవారుజామున 3.14 గంటలకు కన్నుమూశారు. ఆయన మృతి పట్ల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నేటి పాదయాత్రను, బహిరంగ సభను రద్దు చేసుకుని వైఎస్ జగన్ హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరారు.