ఎగ్జిట్‌ పోల్స్‌... చంద్రబాబుకు పొలిటికల్‌ ఎగ్జిట్‌ పోల్స్ | Chandrababu Naidu fear of election results says kannababu | Sakshi
Sakshi News home page

ఎగ్జిట్‌ పోల్స్‌... చంద్రబాబుకు పొలిటికల్‌ ఎగ్జిట్‌ పోల్స్

May 20 2019 3:17 PM | Updated on Mar 21 2024 11:09 AM

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కళ్లలో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ పార్లమెంట్‌ అధ్యక్షుడు కురసాల కన్నబాబు అన్నారు. అందుకే ఆయన ఎక్కే గుమ్మం...దిగే గుమ్మం చేస్తున్నారన్నారు. కన్నబాబు సోమవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. నిన్నటి ఎగ్జిట్‌ పోల్స్‌...చంద్రబాబుకు పొలిటికల్‌ ఎగ్జిట్‌ పోల్‌ అని వ్యాఖ్యానించారు. 2014లో ఇవే ఈవీఎంలపై గెలిచిన ఆయన ఇప్పుడు వాటిని తప్పుబడితే ఎలా అని సూటిగా ప్రశ్నించారు. అలా అనుకుంటే ఆనాడు చంద్రబాబు గెలుపు కూడా తప్పే అని అన్నారు. ఓటమి భయంతోనే చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి రోజుకో డిమాండ్‌ ఎన్నికల సంఘం ముందు ఉంచుతున్నారన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement