‘దాడి చేస్తాం, ముట్టడిస్తామనేది సరైన పద్దతి కాదు’
చట్ట సభలకు హాజరు కాకుండా నిరోదించడమనేది సభా హక్కులను హరించడమే అవుతుందని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. సభ్యుల హక్కులను హరిస్తే రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని.. రాజ్యాంగాన్ని ఉల్లంఘించేలా ఎవరైనా వ్యవహరిస్తే చట్టం కచ్చితంగా తన పని తాను చేస్తోందని హెచ్చరించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేపు(సోమవారం) శాసన సభ సమావేశాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. సభలు నిర్వహించకుండా ఎవరైనా అడ్డుకుంటే అది సభా హక్కుల ఉల్లంఘన అవుతుందన్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి