పోలవరం ప్రాజెక్టు పనుల్లో మరో అవినీతి పర్వమిది. పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్స్(జలాశయం పనులు)లో ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్(ఈసీఆర్‌ఎఫ్– రాతి, మట్టికట్ట) మిగిలిన పనుల పూర్తికి 809.53 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా అంచనా వ్యయాన్ని రాష్ట్రప్రభుత్వం అమాంతం మూడింతలు.. అంటే రూ.2,400 కోట్లకుపైగా పెంచింది