ఐదు, పది కాదు ఏకంగా 15 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా తీసుకొస్తామన్న వాళ్లు రాష్ట్ర ప్రజలను మోసం చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. గురువారం గుంటూరులో పార్టీ నిర్వహించిన వంచనపై గర్జన దీక్ష సభలో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.