అభివృద్ధి కార్యక్రమం పేరుతో రికార్డింగ్‌ డ్యాన్స్‌లు | Recording dances in the name of development program | Sakshi
Sakshi News home page

అభివృద్ధి కార్యక్రమం పేరుతో రికార్డింగ్‌ డ్యాన్స్‌లు

Sep 1 2026 11:48 PM | Updated on Sep 1 2026 11:48 PM

అభివృద్ధి కార్యక్రమం పేరుతో ఏర్పాటు చేసిన వేదికపై నిషేధిత రికార్డింగ్‌ డ్యాన్స్‌లు నిర్వహించడం వివాదాస్పదంగా మారింది. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం పెమ్మారెడ్డిపాళెంలో నూతన పార్కు ప్రారంభోత్సవం సందర్భంగా సోమవారం రాత్రి ఏర్పాటు చేసిన రికార్డింగ్‌ డ్యాన్స్‌లపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల సమక్షంలో, బహిరంగ వేదికపై ఇలాంటి ప్రదర్శనలు నిర్వహించడం ఏమిటంటూ ప్రశ్నిస్తున్నారు. పార్కు ప్రారంభోత్సవానికి టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డితోపాటు పలువురు ప్రజాప్రతినిధులను ఆహ్వానించారు. అయితే అభివృద్ధి కార్యక్రమానికి జనాన్ని ఆకర్షించేందుకు రికార్డింగ్‌ డ్యాన్స్‌లు చేయించి, దిగజారుడు రాజకీయాలు చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement