పరీక్షలు రాసిన సాయి పల్లవి | Watch: Sai Pallavi Steps Out Write Exam Photos Viral | Sakshi
Sakshi News home page

పరీక్షలు రాసిన సాయి పల్లవి

Sep 2 2020 8:41 PM | Updated on Mar 21 2024 7:59 PM

తన డాన్స్‌తో, నటనతో ప్రేక్షకులను ఫిదా చేసిన  హీరోయిన్ సాయి పల్లవి. మలయాళ చిత్రం ప్రేమమ్‌ ద్వారా కథానాయికగా పరిచయమైన ఈ బ్యూటీ తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.  మలయాళం, తమిళం భాషల్లో కంటే తెలుగులోనే సాయి పల్లవికి మంచి గుర్తింపు లభించింది. ఇప్పుడు అక్కడ మంచి క్రేజ్‌ వున్న నటిగా రాణిస్తోంది. తమిళంలో మూడు చిత్రాల్లో నటించిన ఆమెకు అక్కడ ఆశించిన విజయం లభించలేదు. కాగా తెలుగులో కథానాయికగా బిజీగా వున్న సాయిపల్లవి ప్రస్తుతం కరోనా కాలంలో పరీక్షలకు ప్రిపేర్‌ అయ్యింది. మంగళవారం ఆమె తిరుచ్చికి వెళ్ళి అక్కడ ఎంఏఎం కళాశాలలో పరీక్షలు రాసింది. 
 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement