టాలీవుడ్ తెలుగు ప్రేక్షకుల దాహాన్ని ఈ వేసవిలో తీరుస్తోంది. వరుసగా పర్ఫామెన్స్ ఓరియంటెడ్ మూవీస్ ప్రేక్షకుల మనసులను గెల్చుకుంటున్నాయి. రంగస్థలం, భరత్ అనే నేను, నా పేరు సూర్యలు స్టార్ హీరోల సినిమాలే అయినప్పటికీ నటనా పరంగా అందర్నీ విశేషంగా ఆకట్టుకున్నాయి. కమర్షియల్ హంగులను కూడా జోడిస్తూ తెరకెక్కించిన ఈ సినిమాలు బాక్స్‌ఫీస్ రికార్డులను పరుగులు పెట్టిస్తున్నాయి. అయితే తెలుగు ప్రేక్షకుల దృష్టి ఇప్పుడు మరొక సినిమాపై ఉంది. ఆ చిత్రమే ‘మహానటి’. ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.