బ‌న్నీని క‌లిసేందుకు అభిమాని పాద‌యాత్ర‌ | Sakshi
Sakshi News home page

బ‌న్నీని క‌లిసేందుకు అభిమాని పాద‌యాత్ర‌

Published Wed, Sep 23 2020 4:48 PM

జ‌నాల‌కు, ముఖ్యంగా యువ‌త‌కు సినీతార‌లంటే అభిమానం ఎక్కువ‌. వారి ఫొటోల‌ను గోడ‌ల‌పై అతికించుకుంటారు. పేర్ల‌ను టాటూలుగా పొడిపించుకుంటారు. మ‌రికొంద‌రైతే ఏకంగా గుడి క‌ట్టిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. వీళ్లంద‌రూ త‌మ జీవితంలో ఒక్క‌సారైనా త‌మ హీరోతో క‌లిసి ఓ ఫొటో దిగాల‌ని, లేదా నేరుగా చూడాల‌ని తాప‌త్ర‌య‌ప‌డుతుంటారు. ఇక్క‌డ చెప్పుకునే వ్య‌క్తి కూడా ఇలాంటి కోవ‌కే చెందుతాడు. పి. నాగేశ్వ‌ర్ రావు  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు వీరాభిమాని. అత‌డిని క‌లిసేందుకు ఏళ్ల త‌ర‌బ‌డి ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. కానీ ఇప్ప‌టివ‌ర‌కు అత‌ని ఆశ‌యం ఫ‌లించ‌నేలేదు. దీంతో ఎలాగైనా ఈసారి హీరో కంట ప‌డాల‌ని మాచ‌ర్ల నుంచి హైద‌రాబాద్ వ‌ర‌కు 250 కి.మీ పాద‌యాత్ర చేసి హైద‌రాబాద్ చేరుకున్నాడు. 

ఈ విష‌యం గురించి నాగేశ్వ‌ర్ రావు మాట్లాడుతూ "గంగోత్రి సినిమా నుంచి నేను బ‌న్నీ అన్నకు ఫ్యాన్‌. అప్ప‌టి నుంచి అన్న‌ను చూసేందుకు నాలుగైదు సార్లు ప్ర‌య‌త్నించా. కానీ, కుద‌ర‌లేదు. అందుకే ఈసారి పాద‌యాత్ర చేప‌ట్టా. ఇది చూసైనా నాకు త‌న‌ను క‌లిసే అవ‌కాశం ఇస్తార‌ని ఆశిస్తున్నా. సెప్టెంబ‌ర్ 17న పాద‌యాత్ర ప్రారంభించా. సెప్టెంబ‌ర్ 22న బంజారా హిల్స్‌కు చేరుకున్నా" అని తెలిపాడు. ఈ వీడియో బ‌న్నీ కంట ప‌డేవ‌ర‌కు షేర్‌ చేస్తామ‌ని ఆయ‌న అభిమానులు అంటున్నారు. కాగా బ‌న్నీ క్రేజ్ తెలుగు రాష్ట్రాల వ‌ర‌కే ప‌రిమితం కాకుండా ఇత‌ర రాష్ట్రాల‌కు కూడా విస్త‌రించిన విష‌యం తెలిసిందే. ఇక‌ ఈ మ‌ధ్యే వ‌చ్చిన బ‌న్నీ 'అల వైకుంఠ‌పురం'లోని పాటలు బాలీవుడ్ సెలబ్రిటీల‌తో కూడా డ్యాన్స్ చేయించాయి.