స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ 'నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా'. ఈ మూవీ కోసం బన్నీ పడ్డ కష్టానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదే క్యాప్ ట్రిక్. లవర్ ఆల్సో.. ఫైటర్ ఆల్సో అనే పాట కోసం బన్నీ ఎంతగానో శ్రమించారు. ఎందుకంటే అందులో క్యాప్‌తో చేసే చిన్న గిమ్మిక్కుల కోసం, సీన్ ఫర్ఫెక్ట్‌గా రావడానికి బన్నీ యత్నించారు. ఏడాది సమయం పట్టే ఎన్నో ట్రిక్కులను బన్నీ హార్డ్‌వర్క్‌తో కేవలం రెండు నెలల సమయంలోపే నేర్చుకున్నారంటూ యూనిట్ పేర్కొంది.