భారత్ తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఆధిక్యం దిశగా సాగుతోంది. ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్ లో భాగంగా ఆదివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. దాంతో ఆసీస్ కు 48 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఈ రోజు ఆటలో తొలుత ఆసీస్ తడబడినట్లు కనిపించినప్పటికీ తిరిగి గాడిలో పడింది. ఆసీస్ కీలక వికెట్లను చేజార్చుకున్న సమయంలో మాథ్యూ వేడ్(25 బ్యాటింగ్), మిచెల్ స్టార్క్(14 బ్యాటింగ్)లు మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు.