చలో అమరావతి పాదయాత్రకు అనుమతి లేదంటూ 24 గంటలపాటు కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను గృహ నిర్బంధం చేయడాన్ని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ముద్రగడ అరెస్ట్‌పై ఆయన ట్విట్టర్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సూటిగా ప్రశ్నించారు. ‘ముఖ్యమంత్రి గారు.. ఒక్క విషయం చెప్పండి. ముద్రగడను ఎందుకు హౌస్ అరెస్ట్ చేశారు. కాపులకు మీరిచ్చిన హామీని, మేనిఫెస్టోలో మీరిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోండి అనేకదా వారు మిమ్మల్ని నిలదీస్తున్నది. మిమ్మల్ని ప్రశ్నిస్తున్నందుకు అరెస్ట్‌లు, బైండోవర్‌లు చేయడం ఏంటి?. వేలమంది పోలీసులు మోహరించడమేంటి?.. తప్పు చేస్తున్నారు చంద్రబాబు గారు..’ అని వైఎస్ జగన్ ట్విట్ చేశారు.
Jul 26 2017 2:32 PM | Updated on Mar 21 2024 7:48 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement