దేశవ్యాప్తంగా అన్ని ఐఐటీలను బలోపేతం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయ సాయిరెడ్డి కోరారు. ఆయన మంగళవారం రాజ్యసభలో మాట్లాడుతూ .. ఐఐటీల్లో కాంట్రాక్ట్ పద్దతిలో కాకుండా శాశ్వత పద్ధతిలో నియామకాలు చేపట్టాలన్నారు. ఒక్కో ఐఐటీకి ఒక డైరెక్టర్ నియమించాలని విజ్ఞప్తి చేశారు. తిరుపతిలో ఐఐటీకి రూ. 1,750 కోట్లు అవసరమైతే ఇప్పటివరకూ కేవలం రూ. 60 కోట్లు మాత్రమే విడుదల చేశారని ఆయన అన్నారు.