జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. భారత్‌కు చెందిన అత్యంత కీలక బేస్ క్యాంపుపై ఉగ్రవాదులు ఆదివారం తెల్లవారుజామున దాడికి పాల్పడ్డారు. యురి సెక్టార్‌లో ఆర్మీ బెటాలియన్ ప్రధాన కార్యాలయంపై జవానులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేశారు. ఉగ్రవాదులతో జరిగిన పోరాటంలో 17 మంది జవాన్లు వీర మరణం పొందగా, 20 మందికి గాయాలయ్యాయి. గాయపడిన జవాన్లను శ్రీనగర్‌లోని ఆర్మీ బేస్ ఆసుత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.