కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. మూడుగంటలపాటు జరిగిన ఈ భేటీలో ఇంకా పలు అంశాలు చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా భేటీ వివరాలను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి వివరించారు. కరీంనగర్, నిజమాబాద్, సిద్ధిపేట, రామగుండంలో పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు. దసరా నుంచి కొత్త జిల్లాలు ప్రారంభించాలని నిర్ణయించారు. తెలంగాణ బీసీ కమిషన్ ఏర్పాటుకు వీలుగా 1993 చట్టంలో సవరణకు ఆమోదం తెలిపామన్నారు.