గ్రేటర్‌లో కలిసొచ్చేదెవరు? | T Congress Committee Meeting On GHMC Elections | Sakshi
Sakshi News home page

Jan 5 2016 9:35 AM | Updated on Mar 22 2024 11:06 AM

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్, మజ్లిస్ పార్టీలను ఓడించడమే లక్ష్యంగా... తమతో కలసివచ్చే పార్టీలతో సర్దుబాటు చేసుకోవాలని టీపీసీసీ ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రానికి ప్రధాన కేంద్రమైన హైదరాబాద్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా కాంగ్రెస్‌తో లోపాయికారీగా కలసివచ్చే అవకాశాలున్న పార్టీలతో టీపీసీసీ ముఖ్యులు చర్చలను జరుపుతున్నారు. ముందుగా సీపీఎం, సీపీఐ, ఎంబీటీ, లోక్‌సత్తా వంటి పార్టీల సహకారాన్ని టీపీసీసీ నేతలు కోరారు. పాతబస్తీలో మజ్లిస్‌కు పట్టున్న స్థానాల్లో ఎవరు పోటీ చేసినా, ఇంకెవరి మద్దతు తీసుకున్నా ప్రయోజనం లేదని కాంగ్రెస్ భావిస్తోంది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement