సచివాలయం అధికారికంగా రెండు ముక్కలు | secretariat-divided-into-two-between-ap-and-tg | Sakshi
Sakshi News home page

May 30 2014 2:55 PM | Updated on Mar 21 2024 6:35 PM

జూన్ 2వ తేదీన ఏర్పాటయ్యే రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరమైన కేటాయింపులు అధికారికంగా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు సచివాలయంలో బ్లాక్లను కేటాయిస్తూ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఏ,బీ,సీ,డీ బ్లాక్లను తెలంగాణకు, ఎల్,జే, నార్త్ హెచ్, కే బ్లాక్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేటాయించారు. కాగా ఎల్ బ్లాక్లోని 8వ అంతస్తును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయంగా, సీ బ్లాక్లోని 6వ అంతస్తును తెలంగాణ ముఖ్యమంత్రికి కేటాయిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక డి బ్లాకును పూర్తిగా మంత్రుల కార్యాలయాలకు, ఎ, బి బ్లాకులను ఆయా శాఖల ముఖ్య కార్యదర్శుల కార్యాలయాలకు కేటాయించారు.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement