నల్లకుబేరుల జాబితాను పార్లమెంట్ ముందు పెట్టాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కు తీసుకొచ్చి పేదలకు పంపిణీ చేస్తామని ఇచ్చిన హామీని మోదీ గాలికి వదిలేశారని విమర్శించారు. రాజస్థాన్ లోని బారాన్ లో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ... తమ బ్యాంకుల్లో ఖాతాలు కలిగిన వారి వివరాలు స్విస్ ప్రభుత్వం.. కేంద్రానికి ఇచ్చిందని, ఈ జాబితాను పార్లమెంట్ లో ఎప్పుడు ప్రవేశపెడతారని ప్రశ్నించారు.