ఇటలీలో భారీ భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున 6.0 నుంచి 6.2 తీవ్రతతో దేశంలో పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూ ప్రకంపనలు తలెత్తాయి. ఫలితంగా మధ్య ఇటలీలోని పర్వత ప్రాంతాల్లో ఉన్న పలు గ్రామాలు కకావికలమయ్యాయి. 120 మంది మృతి చెందినట్లు ఇటలీ ప్రధాని రెంజీ ప్రకటించారు. 368 మందికిపైగా గాయాలయ్యాయి.