'పురచ్చితలైవి అమ్మ నన్ను నియమించారు.. ఇప్పటికీ నేనే చీఫ్ సెక్రటరీని. నన్ను బదిలీ చేస్తూ ఇంతవరకు ఉత్తర్వులు ఏమీ ఇవ్వలేదు. అమ్మే బతికుంటే ఇలా జరిగేదా.. అసలు చీఫ్ సెక్రటరీ ఇంటిమీద, ఆఫీసులో ప్రవేశించడానికి వాళ్లకు ఎంత ధైర్యం'' అంటూ తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి పి.రామ్మోహనరావు మండిపడ్డారు. ఈనెల 20వ తేదీ ఉదయం 5.30 గంటలకు సీఆర్పీఎఫ్ భద్రతతో ఆదాయపన్ను అధికారులు ఆయన ఇల్లు, ఆయన బంధువుల ఇళ్లపై దాడిచేసి పెద్దమొత్తంలో నగలు, నగదు, పత్రాలను స్వాధీనం చేసుకున్న తర్వాత.. ఇన్నాళ్లకు ఆయన మీడియా ముందుకు వచ్చారు