వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు వచ్చిన వార్తలను నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఖండించారు. పార్టీకి రాజీనామా చేసే ప్రసక్తే లేదని, చివరి వరకూ వైఎస్ జగన్ వెంటే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. తాను పార్టీకి రాజీనామా చేసి ఆ లేఖను ఫ్యాక్స్ చేసినట్లు కొన్ని మీడియా ఛానల్స్ అసత్య ప్రచారం చేస్తున్నాయన్నారు. నల్లపరెడ్డి బుధవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ' నేను పార్టీకి రాజీనామా చేయలేదు. రాజీనామా లేఖను పార్టీ ఆఫీసుకు పంపించినట్లు, రాజీనామా చేసినట్లు చెప్పారు. ఏ రాజీనామా లేఖను పంపలేదు. ఫ్యాక్స్ చేయలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాను.