అమ్మాయిలు అన్ని రంగాల్లో రాణిస్తున్న ఆధునిక యుగంలోనూ వారిపై వివక్ష కొనసాగుతూనే ఉంది. మూడోసారీ ఆడబిడ్డకు జన్మనిచ్చందని ఓ వ్యక్తి తన భార్యను ఇంటి నుంచి గెంటేశాడు. నగరంలోని దిల్సుఖ్నగర్ వికాస్నగర్కు చెందిన సంతోష్కు తొమ్మిదేళ్ల క్రితం పరిగికి చెందిన రమాదేవితో వివాహమైంది. వీరికి ముగ్గురూ ఆడపిల్లలే జన్మించడంతో రమాదేవికి అత్తవారింటి నుంచి వేధింపులు అధికమయ్యాయి. దీంతో ఆమె మానవ హక్కుల సంఘానికి ఆశ్రయించింది. దీనిపై ఆగ్రహం చెందిన భర్త ఆమెను ఇంటి నుంచి గెంటేశాడు. తనకు న్యాయం చేయాలని రమాదేవి తన పిల్లలతో కలసి ఇంటి ముందు బైఠాయించింది.
Nov 6 2013 5:27 PM | Updated on Mar 21 2024 11:26 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement