తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం కోసం వెళ్లదలిచిన వారికి త్వరలో హెలికాప్టర్ ప్రయాణం అందుబాటులోకి రానుంది. రాష్ట్రంలో టెంపుల్ టూరిజం అభివృద్ధిలో భాగంగా కొద్ది రోజుల్లోనే విజయవాడ నుంచి తిరుపతి, శ్రీశైలం మధ్య హెలిక్టాపర్ రాకపోకలు మొదలు కాబోతున్నారుు. రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల సందర్శనకు విదేశీ యాత్రికులను ఎక్కువగా ఆకర్షించేందుకు దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తోంది. ఇందులో భాగంగా తిరుపతి, శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాలకు హెలికాప్టర్ సర్వీసులను నడపడానికి ఢిల్లీకి చెందిన సుమిత్ ఏవియేషన్ సంస్థ ముందుకొచ్చింది. తిరుపతిసహా మిగిలిన పుణ్యక్షేత్రాల వద్ద ప్రభుత్వం హెలిప్యాడ్ వసతిని కల్పించడంతోపాటు హెలికాప్టర్ ద్వారా వచ్చే యాత్రికులకు తిరుమలలో నివాస వసతి, దైవ దర్శనం ఏర్పాట్లు కల్పించాలంటూ సుమిత్ ఏవియేషన్ యజమాన్యం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఏవియేషన్ సంస్థ ఇందుకు ప్రభుత్వం అంగీకరించడంతో తొలి దశలో తిరుపతి, శ్రీశైలంలకు హెలికాప్టర్ సర్వీసులు అందుబాటులోకి తెచ్చేందుకు ఆ సంస్థ సిద్ధమవుతోంది.
Nov 8 2016 8:07 AM | Updated on Mar 22 2024 11:21 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement