తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందింది. వచ్చే నెల 1న ఉద్యోగులకు జీతంలో 10 వేల రూపాయలు నగదు చేతికిచ్చేందుకు భారతీయ రిజర్వు బ్యాంకు అంగీకరించింది. దేశమంతా నోట్ల కష్టాలతో అల్లాడుతున్న నేపథ్యంలో ఆర్బీఐ నిర్ణయం తెలంగాణ ఉద్యోగులకు ఊరట కలిగించనుంది.