తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేల విషయంలో దాఖలైన అనర్హత పిటిషన్లను మూడు నెలల్లోగా పరిష్కరించాలని హైకోర్టు జారీ చేసిన ఆదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో గుబులు పుట్టిస్తున్నాయి. వైఎస్సార్‌సీపీ నుంచి ఎన్నికైన వారిలో 20 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి ఫిరాయించారు. వీరిపై అనర్హత వేటు వేయాలని వైఎస్సార్‌సీపీ అసెంబ్లీ స్పీకర్‌ను కోరింది. 20 పిటిషన్లు ఆయన వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. హైకోర్టు తాజా ఉత్తర్వుల నేపథ్యంలో ఒకవేళ స్పీకర్ ఏదైనా ప్రతికూల నిర్ణయం తీసుకుంటే తాము మాజీలమవుతామని ఆ ఎమ్మెల్యేల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.