జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు మంగళవారం కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రోడ్లు, నాలాలు దుర్భర స్థితికి చేరడానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం కారణమంటూ ధర్నా చేశారు. జీహెచ్‌ఎంసీ అసమర్ధత వల్ల అనేక మరణాలు సంభవించాయని, నాగోల్ ప్రాంతంలోని నాలా వద్ద ఓ యువకుడు గల్లంతైనా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. ఈ ఆందోళనలో స్థానిక కాంగ్రెస్ నేతలు సుధీర్‌రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్‌తో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.