భద్రాద్రికి ‘పర్యావరణ’ బ్రేక్ | Sakshi
Sakshi News home page

భద్రాద్రికి ‘పర్యావరణ’ బ్రేక్

Published Thu, Nov 10 2016 7:48 AM

జిల్లా మణుగూరులో 1080 (270గీ4) మెగావాట్ల సామర్థ్యంతో తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్‌కో) నిర్మించతలపెట్టిన భద్రాద్రి సబ్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్‌కు పర్యావరణ అనుమతులు జారీ చేయలేమని తాజాగా కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ తేల్చి చెప్పింది. 13వ పంచవర్ష ప్రణాళిక (2017-22) కాలంలో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో పనిచేసే థర్మల్ విద్యుత్ కేంద్రాలను మాత్రమే ఏర్పాటు చేయాలని 2009 నవంబర్ 13న కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ రూపొందించిన ఈ పాలసీకి విరుద్ధంగా సబ్ క్రిటికల్ టెక్నాలజీ ఆధారిత ప్లాంట్లకు అనుమతిచ్చే ప్రతిపాదనలను పరిశీలించలేమని స్పష్టం చేసింది. భద్రాద్రి ప్లాంట్‌కు పర్యావరణ అనుమతుల కోసం జెన్‌కో సమర్పించిన ప్రతిపాదనలు పరిశీలనార్హం కావని ప్రకటిస్తూ ఈ నెల 4న కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement
Advertisement