‘క్యూ - నెట్’ కేసులో మైఖేల్ ఫెరీరా అరెస్టు | Billiards Champion Michael Ferreira Catches Break In Multicrore QNet Scam | Sakshi
Sakshi News home page

Oct 20 2016 6:56 AM | Updated on Mar 22 2024 11:13 AM

క్యూ-నెట్ మల్టీలెవెల్ మార్కెటింగ్ పేరుతో లక్షలాది మందిని మోసగించిన కేసులో ప్రమేయంపై ప్రపంచ బిలియర్డ్స్ మాజీ చాంపియన్, పద్మభూషణ్ అవార్డుగ్రహీత మైఖేల్ జోసఫ్ ఫెరీరా (78)తోపాటు మరో ముగ్గురిని సీసీఎస్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా సుమారు 5 లక్షల మందిని రూ. 700 కోట్లకు మోసగించిన క్యూ-నెట్ సంస్థకు భారత్‌లో అనుబంధంగా ఏర్పాటైన విహాన్ డెరైక్ట్ సెల్లింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు ఫెరీరాతోపాటు ముంబై, బెంగళూరు ప్రాంతాలకు చెందిన మాల్కమ్ నోజర్ దేశాయ్, మగర్‌లాల్ వి.బాలాజీ, వి.శ్రీనివాసరావులు డెరైక్టర్లుగా వ్యవహరిస్తున్నారని హైదరాబాద్ నేర పరిశోధన విభాగం (సీసీఎస్) డీసీపీ అవినాష్ మహంతి తెలిపారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement