ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే కాంక్రీట్ పనులకు శంకుస్థాపన చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 1.59 గంటలకు ప్రాజెక్టు స్పిల్ వే కాంక్రీట్ పనులను ఆరంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు సురేష్ ప్రభు, వెంకయ్యనాయుడు, సుజనా చౌదరి, నిర్మలా సీతారామన్ తదితరులు పాల్గొన్నారు. 52 బ్లాకులుగా స్పిల్‌వే నిర్మాణం జరగనుంది. మరోవైపు కాంక్రీట్ పనుల శంకుస్థాపనను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల ఖర్చుతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది.