ఎంపీ గైక్వాడ్‌పై నిషేధం ఎత్తేసిన ఎయిరిండియా | air india lifts ban on shivsena MP ravindra gaikwad | Sakshi
Sakshi News home page

Apr 7 2017 4:36 PM | Updated on Mar 22 2024 11:05 AM

అనేక నాటకీయ పరిణామాల మధ్య శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌పై ఎయిరిండియా నిషేధాన్ని ఎత్తివేసింది. తమ సిబ్బందిపై దాడి ఘటనలో గైక్వాడ్‌పై ఎయిరిండియా నిషేధం విధించిన విషయం తెలిసిందే. కాగా కేంద్ర ప్రభుత్వం జోక్యంతో గైక్వాడ్‌పై నిషేధం ఎత్తివేయాలంటూ పౌరవిమానయాన శాఖ శుక్రవారం ఎయిరిండియాకు లేఖ రాసింది. దీంతో ఎయిరిండియా తన నిషేధాన్ని వెనక్కి తీసుకుంది. కాగా ఎయిరిండియా సిబ్బందిపై దాడి ఘటనపై గైక్వాడ్‌ పశ్చాత్తాపం వ‍్యక్తం చేస్తూ నిన్న పౌర విమానయాన శాఖకు లేఖ రాసిన విషయం తెలిసిందే. దీనిపై ఆ శాఖ సంతృప్తి వ్యక్తం చేసింది కూడా.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement