అపోలో ఆస్పత్రిలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేల సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం విషమించడంతో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు సోమవారం అత్యవసరంగా అపోలో ఆస్పత్రిలో భేటీ అయ్యారు. ‘అమ్మ’ ఆరోగ్యం అత్యంత ఆందోళనకరంగా ఉన్న నేపథ్యంలో తదుపరి నాయకత్వంపై చర్చించినట్టు సమాచారం. జయ వారసుడిగా పన్నీరు సెల్వం పేరును ప్రతిపాదించినట్టు తెలిసింది. పన్నీరు సెల్వంకు మద్దతుగా ఎమ్మెల్యేలు సంతకాలు చేసినట్టు సమాచారం. గతంలో జయకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తినపుడు పన్నీరు సెల్వం తాత్కాలిక ముఖ్యమంత్రిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.