తెలుగు చిత్ర పరిశ్రమకు భారీ షాక్. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో బడా నిర్మాతలపై ఆదాయపు పన్ను శాఖ దృష్టి సారించింది. రికార్డులతో పాటు భారీ కలెక్షన్లు వసూలు చేసిన ’బాహుబలి' చిత్ర నిర్మాతల నివాసాలు, కార్యాలయాలపై ఐటీ శాఖ శుక్రవారం దాడులు నిర్వహించింది. చిత్ర నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నివాసాలతో పాటు కార్యాలయాల్లోనూ ఏకకాలంలోనూ సోదాలు జరుపుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.