చెరువులో పడ్డ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ | - | Sakshi
Sakshi News home page

చెరువులో పడ్డ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌

Apr 15 2026 7:44 AM | Updated on Apr 15 2026 7:44 AM

బద్వేలు అర్బన్‌ : అదుపుతప్పి తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనం చెరువులో పడ్డ ఘటన మంగళవారం బద్వేలు పట్టణ శివారులో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. పోరుమామిళ్ల ప్రభుత్వాసుపత్రి పరిధిలోని తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనానికి కలసపాడుకు చెందిన రాకేష్‌రెడ్డి పైలట్‌గా వ్యవహరిస్తున్నాడు. మంగళవారం పోరుమామిళ్ల ప్రభుత్వాసుపత్రి పరిధిలోని ఓ గర్భిణీసీ్త్రని ప్రసవం నిమిత్తం బద్వేలు ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చి అక్కడి నుంచి కడప రిమ్స్‌లో చేర్పించి తిరిగి పోరుమామిళ్ళకు వెళుతున్న సమయంలో పోరుమామిళ్ల బైపాస్‌ రోడ్డులో గేదెలు అడ్డురావడంతో వాహనం అదుపుతప్పి నాగులచెరువులో పడింది. ఈ ఘటనలో పైలట్‌ రాకేష్‌రెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. వాహనం చెరువులో పడిన సమయంలో అందులో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాల జిల్లా మేనేజర్‌ భార్గవ్‌ ఘటన స్థలాన్ని పరిశీలించి చెరువులో పడిన వాహనాన్ని బయటికి తీసే చర్యలు ప్రారంభించారు.

పైలట్‌కు స్వల్ప గాయాలు

Advertisement
 
Advertisement
Advertisement