దర్గా ఏ గఫారియా | - | Sakshi
Sakshi News home page

దర్గా ఏ గఫారియా

Apr 1 2026 8:12 AM | Updated on Apr 1 2026 8:12 AM

మతసామరస్యానికి ప్రతీక దర్గా ఏ గఫారియా

అలరించనున్న ఖవ్వాలి

మతసామరస్యానికి ప్రతీక

ఉరుసు మహోత్సవాలను పురస్కరించుకొని దర్గా ప్రాంగణంలో గంధం, ఉరుసు రెండు రోజుల పాటు గొప్ప ఖవ్వాలి పోటీ నిర్వహించ నున్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బెల్గాంకు చెందిన ఉస్తాద్‌ మురాద్‌ ఆతిష్‌, యూపీకి చెందిన రాజా సర్ఫరాజ్‌ ల మధ్య గొప్ప ఖవ్వాలి పోటీ జరుగుతుందని, నిర్వాహకులు తెలిపారు.

3న బండ లాగుడు పోటీలు:

ఉరుసు మహోత్సవాలను పురస్కరించుకొని ఏప్రిల్‌ 3న దర్గా ప్రాంగణంలో పాల దంతాలు కలిగిన వృషభ రాజములచే చిన్న బండ లాగుడు పోటీలు నిర్వహించ నున్నా రు. విజేత ఎడ్ల యజమానులకు నగదు బహుమ తులు అందించనున్నారు. పోటీల్లో పాల్గొనే ఎడ్ల యజమానులు 13వ తేదీ ఉదయం 7గంటల్లోపు 97011 23459, 81219 96786 నెంబర్‌కు సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.

కమలాపురం: కమలాపురం పట్టణంలో వెలిసిన దర్గా ఏ గఫారియా మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతోంది. దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన ఈ దర్గాలో హజరత్‌ అబ్దుల్‌ గఫార్‌షాఖాద్రీ, హజరత్‌ దస్తగిరిషాఖాద్రీ, హజరత్‌ మౌలానా మౌల్వి ఖాదర్‌ మొహిద్దీన్‌ షా ఖాద్రి, హజరత్‌ జహీరుద్దీన్‌ షాఖాద్రీ ఖుద్దస సిర్రహుం వెలసి ఉన్నారు. ఏటా ఈ ఉరుసు మహోత్సవాలు అంగరంగ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం 106వ ఉరుసు మహోత్సవాల నిర్వహణకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ముతవల్లి సజ్జాదె–ఏ–నషీన్‌ హజరత్‌ ఫైజుల్‌ గఫార్‌ షా ఖాద్రి, వారి సోదరుల ఆధ్వర్యంలో ఈ ఉరుసు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్‌ నెల 1వ తేదీ నషాన్‌తో ఉరుసు మహోత్సవాలు ప్రారంభమై, 2న గంధం, 3న ఉరుసు, 4న తహలిల్‌తో కార్యక్రమాలు ముగుస్తాయి. ఉరుసు ఉత్సవాలకు దర్గా సుందరంగా ముస్తాబైంది. రాష్ట్రం నలు మూలల నుంచే కాక తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ నుంచి సైతం భక్తులు తరలి రానున్నారు.

మతసామరస్యానికి ప్రతీక

ఈ దర్గాను హిందువులే నిర్మించడంతో ఈ దర్గా మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. హజరత్‌ దస్తగిరిషా ఖాద్రికి ముఖ్య శిష్యుడుగా ఉన్న నామా నాగయ్య శ్రేష్ఠి కుటుంబ సభ్యులు ఇప్పటికీ ధర్మకర్తగా కొనసాగుతుండడం విశేషం.

హాజి జహీరుద్ధీన్‌ షా ఖాద్రి,

స్వర్గీయ పీఠాధిపతి

ఫైజుల్‌ గఫార్‌ షా ఖాద్రి, ప్రస్తుత పీఠాధిపతి

2న గంధం, 3న ఉరుసు

ఏర్పాట్లు పూర్తి చేసిన దర్గా నిర్వాహకులు

మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలనుంచి తరలి రానున్న భక్త జనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement