ముఖ్యమంత్రి కాన్వాయ్‌ రిహార్సల్‌ నిర్వహణ | - | Sakshi
Sakshi News home page

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ రిహార్సల్‌ నిర్వహణ

Apr 1 2026 8:06 AM | Updated on Apr 1 2026 8:06 AM

ఒంటిమిట్ట: ఒంటిమిట్ట వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు సీతారాముల కల్యాణ మహోత్సవానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రానున్న నేపథ్యంలో మంగళవారం ఒంటిమిట్టలో కాన్వాయ్‌ రిహార్సల్‌ నిర్వహించారు. కలెక్టర్‌ శ్రీధర్‌, ఎస్పీ నచికేత్‌ విశ్వనాథ్‌తో కలిసి కర్నూల్‌ రేంజ్‌ డీఐజీ డాక్టర్‌ కోయ ప్రవీణ్‌ ఈ రిహార్సల్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా కాన్వాయ్‌ వెళ్లే మార్గంలో చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లపై పోలీసు అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. రహదారి వెంట చేపట్టాల్సిన భద్రతా చర్యలపై పోలీసు అధికారులకు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం, టీటీడీ గెస్ట్‌ హౌస్‌, కల్యా ణ వేదిక తదితర ప్రాంతాల్లో బందోబస్త్‌పై సూచన లు చేశారు. భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు. టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, టీటీడీ సీవీఎస్‌వో మురళీ కృష్ణ, జేసీ నిధి మీనా పాల్గొన్నారు.

పరిశీలించిన కర్నూల్‌ రేంజ్‌

డీఐజీ డాక్టర్‌ కోయ ప్రవీణ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement