యువతి అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

యువతి అదృశ్యం

Dec 14 2025 8:50 AM | Updated on Dec 14 2025 8:50 AM

యువతి

యువతి అదృశ్యం

ముద్దనూరు : మండలంలోని యామవరం గ్రామానికి చెందిన ఓ యువతి అదృశ్యమైనట్లు పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. ఏఎస్‌ఐ రమేష్‌ సమాచారం మేరకు యామవరానికి చెందిన యువతి ఇంటర్మీడియట్‌ చదువుతోంది. శుక్రవారం రాత్రి ఆమె ఇంటిలో ఉంది. శనివారం తెల్లవారుజాము నుంచి కనిపించలేదు. చుట్టుపక్కల విచారించినా ఫలితం లేకపోవడంతో తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు.

అదనపు కట్నం కోసం

వేధింపులపై కేసు

ముద్దనూరు : భర్తతో పాటు బంధువులు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని భార్య ఫిర్యాదు మేరకు శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ మైనుద్దీన్‌ సమాచారం మేరకు మండలంలోని కొర్రపాడు గ్రామానికి చెందిన గంగాకృష్ణవేణికి ఓబుళాపురం గ్రామానికి చెందిన గణేష్‌ అనే వ్యక్తితో సమారు 6నెలల క్రితం వివాహమైంది. వివాహ సమయంలో 13 తులాల బంగారు కట్నం కింద గణేష్‌కు ఇచ్చారు. అయితే గత కొంత కాలంనుంచి అదనపు కట్నం తేవాలని భర్త గణేష్‌, అతని బంధువులు తనను వేధిస్తున్నారని గంగాకృష్ణవేణి ఫిర్యాదు చేసింది. దీంతో గణేష్‌తో పాటు మరో నలుగురిపై అదనపు కట్నం కోసం వేధిస్తున్నట్లు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

కుక్కల బారినపడి

పొడదుప్పి మృతి

అట్లూరు : మండల పరిధిలోని కళావాండ్లపల్లి గ్రామం కుక్కల బారిన పడి పొడదుప్పి మృతి చెందింది. స్థానికుల వివరాల మేరకు శనివారం ఉదయం లంకమల అభయారణ్యం నుంచి కళావాండ్లపల్లి గ్రామం వైపు కొన్ని పొడదుప్పిలు గుంపుగా రావడంతో కుక్కలు వెంబడించాయి. ఓ పొడదుప్పి స్కూల్‌ ఆవరణలోకి ఎగిరి దూకింది. కుక్కలు దుప్పిని వెంబడించి గాయపరిచాయి. స్థానికులు గుర్తించి ఎస్‌ఐ నాగకీర్తనకు సమాచారం ఇవ్వడంతో ఆమె సిద్ధవటం ఫారెస్టు రేంజ్‌ అధికారి కళావతికి సమాచారం ఇచ్చారు. రేంజ్‌ అధికారి ఆదేశాల మేరకు సిబ్బంది సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించగా అప్పటికే దుప్పి మృతి చెంది ఉంది. దీంతో పోస్టుమార్టం చేసి అడవిలో ఖననం చేశారు.

వీఆర్‌ఏల సమస్యలు పరిష్కరించాలి

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలు పరిష్కారమయ్యేంతవరకు పోరాటాలు నిర్వహిస్తామని ఏపీ వీఆర్‌ఏ జేఏసీ రాష్ట్ర వైస్‌ చైర్మన్‌ నల్లిపోగు నాగేశం, జేఏసీ స్టేట్‌ సెక్రటరీ కొమ్మద్ది ఈశ్వరయ్య పేర్కొన్నారు. శనివారం నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ వీఆర్‌ఏల సమస్యలపై ఈనెల 16న సీసీఎల్‌ఏ చీఫ్‌ కమిషనర్‌ ప్రధాన కార్యాలయం ఎదుట మహా ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా చంద్రబాబు ప్రభుత్వానికి వీఆర్‌ఏల సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధి లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర తరహాలో వీఆర్‌ఏలకు పే స్కేలు ఇవ్వాలని, కనీస వేతనం రూ. 26 వేలు బేసిక్‌ స్కేల్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో జిల్లా జేఏసీ అధ్యక్షుడు కె.పుల్లయ్య ఉపాధ్యక్షుడు షేక్‌ బాషా పాల్గొన్నారు.

ఇంటర్‌ విద్యార్థిపై దాడి

మదనపల్లె రూరల్‌ : ఇంటర్‌ విద్యార్థిపై కొందరు వ్యక్తులు మూకుమ్మడిగా దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన శనివారం రాత్రి మదనపల్లెలో జరిగింది. చిత్తూరుజిల్లా పుంగనూరు మండలం చండ్రమాకులపల్లె పంచాయతీ కృష్ణాపురానికి చెందిన రాజబాబు, కళావతి దంపతుల కుమారుడు రెడ్డిప్రసాద్‌(18) స్థానికంగా ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్‌ చదువుతున్నాడు. ఈ క్రమంలో శనివారం కాలేజీ వదిలిన తర్వాత రెడ్డిప్రసాద్‌ గ్రామానికి చెందిన విద్యార్థినిని మదనపల్లెకు చెందిన ఓ యువకుడు టీజీంగ్‌ చేశాడు. ఈ విషయమై రెడ్డిప్రసాద్‌ అతడిని నిలదీశాడు. దీంతో యువకుడు మరి కొందరితో కలిసి గుంపుగా వచ్చి రెడ్డిప్రసాద్‌ కోమటివానిచెరువు కట్టపై నడిచి వస్తుండగా, విచక్షణారహితంగా దాడిచేసి కొట్టారు. చంపేస్తామంటూ బెదిరించారు. దాడిలో రెడ్డిప్రసాద్‌ తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకోగా గమనించిన స్థానికులు బాధితుడిని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్‌ చేశారు. టూటౌన్‌ పోలీసులు విచారణ చేస్తున్నారు.

యువతి అదృశ్యం
1
1/2

యువతి అదృశ్యం

యువతి అదృశ్యం
2
2/2

యువతి అదృశ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement