పొలతల, నిత్యపూజకోనకు ప్రత్యేక బస్సులు
కడప కోటిరెడ్డిసర్కిల్ : పవిత్ర కార్తీకమాసం సందర్భంగా ప్రతి సోమవారంజిల్లాలోని పొలతల, నిత్యపూజకోనలకు ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ కడప డిపో మేనేజర్ ఒక ప్రకటనలో తెలిపారు. పొలతలకు ఉదయం 6.30, 9.00, 11.30, మధ్యాహ్నం 02.15, 4.45 గంటలకు, నిత్యపూజకోనకు ఉదయం 6.30, 9.30, మద్యాహ్నం 12.30, 3.30 గంటలకు బస్సులు పాత బస్టాండు నుంచి బయలుదేరుతాయన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
నేడు మాజీ ఉప రాష్ట్రపతి రాక
కడప సెవెన్‌రోడ్స్ : బ్రౌన్ శాస్త్రి శతజయంతి వేడుకల్లో పాల్గొనేందుకు మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు శనివారం కడప నగరానికి వస్తున్నారు. ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరి 12.40 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 12.40 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.00 గంటకు కడప స్టేట్ గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. రాత్రికి స్టేట్ గెస్ట్‌హౌస్‌లోనే బస చేస్తారు. ఆదివారం ఉదయం 9.15 గంటలకు స్టేట్ గెస్ట్‌హౌస్ నుంచి బయలుదేరి 9.20 గంటలకు సీపీ బ్రౌన్ గ్రంథాలయానికి చేరుకుంటారు. 9.30 నుంచి 11.30 గంటల వరకు బ్రౌన్ శాస్త్రి శతజయంతి వేడుకల్లో వెంకయ్యనాయుడు పాల్గొంటారు. 11.45 గంటలకు బ్రౌన్ లైబ్రరీ నుంచి బయలుదేరి 12.15 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 1.00 గంటలకు కడప ఎయిర్‌పోర్టునుంచి విమానంలో బయలుదేరి 1.55 గంటలకు చైన్నె ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
బందోబస్తు ఏర్పాట్ల పరిశీలన
కడప అర్బన్ : దేశ మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు కడప నగర పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై పోలీస్ అధికారులకు జిల్లా ఎస్.పి షెల్కే నచికేత్ విశ్వనాథ్ పలు సూచనలు చేశారు. నవంబర్ 1, 2 తేదీల్లో మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు కడప నగర పర్యటన నేపథ్యంలో ఎరమ్రుక్కపల్లి లోని సీపీ బ్రౌన్ భాష పరిశోధన కేంద్రం వద్ద శుక్రవారం సాయంత్రం ఎస్పీ పర్యటించారు. కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ అదనపు ఎస్.పి (పరిపాలన) శ్రీ కె.ప్రకాష్ బాబు గారు, కడప డీఎస్పీ ఎ.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
నియామకం
కడప కార్పొరేషన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ జిల్లాకు చెందిన కింద తెలియజేస్తున్న వారిని రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీల్లో వివిధ హోదాల్లో నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా ఎం.నరసింహారెడ్డి (మైదుకూరు), రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా ప్రణీత్‌రెడ్డి (బద్వేలు), జిల్లా రైతు విభాగం ఉపాధ్యక్షుడిగా కె.లక్ష్మినారాయణరెడ్డి (కమలాపురం)లను నియమించారు.
సిజేరియన్ ఆపరేషన్
జరగకుండా చూడాలి
కడప రూరల్ : సిజేరియన్ ఆపరేషన్ జరగకుండా గర్భిణుల ఆరోగ్య పరిరక్షణకు వైద్య సిబ్బంది చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. శుక్రవారం కడపలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ నాగరాజు అధ్యక్షతన మాతృ మరణాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఉమామహేశ్వర్ కుమార్ మాట్లాడుతూ ప్రతి హైరిస్క్ గర్భిణులను సకాలంలో గుర్తించాలన్నారు. వారిని తరచూ సీ్త్ర వ్యాధి నిపుణులకు చూపించాలని తెలిపారు. ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించాలన్నారు. . ప్రతి గర్భిణిని సాధారణ కాన్పు కోసం సాధారణ సిద్ధం చేయాలన్నారు. సీ్త్ర వ్యాధి నిపుణులు డాక్టర్ లక్ష్మీ సుశీల మాట్లాడుతూ గర్భిణులకు ప్రతి నెల పీఎంఎస్‌ఎంఏ ప్రోగ్రాం లో రక్త పరీక్షలు, స్కానింగ్ చేయించాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ హిమాదేవి, డాక్టర్ బాలసుబ్రమణ్యం, డాక్టర్ శాంతి కుమారి, డాక్టర్ శాంతిలత పాల్గొన్నారు.
కడపకు దంపతుల
హత్య కేసు నిందితులు
కడప అర్బన్ : చిత్తూరు మేయర్ కఠారి అనురాధ, మోహన్ దంపతులను దారుణంగా హత్య చేసిన నిందితులను శుక్రవారం కడప కేంద్రకారాగారానికి పోలీసులు తరలించారు. నిందితులకు చిత్తూరు కోర్టు ఉరిశిక్ష ఖరారు చేయడంతో భద్రత నడుమ కడప కేంద్రకారాగారానికి తరలించారు. ఐదుగురు నిందితులకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ చిత్తూరులోని ఆరవ అదనపు సెషన్ కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.


