విచారణ లేకుండా డిప్యూటేషన్ ఎలా వేస్తారు
కడప ఎడ్యుకేషన్ : తిరుపతి ఇంటర్ డీవీఈఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న నన్ను ఎలాంటి విచారణ లేకుండా వేరేచోటుకు డిప్యూటేషన్‌పై (వర్క్ అడ్జెస్ట్‌మెంట్) ఎలా వేస్తారని తిరుపతి ఇంటర్ డీడీఈవో కార్యాలయం సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మునిచంద్ర అధికారులను ప్రశ్నించారు. దీంతోపాటు ఎయిడెడ్ నుంచి వచ్చిన మరో వ్యక్తికి ఏ జీవో ప్రకారం పదోన్నతి ఇస్తున్నారో తెలపాలని డిమాండ్ చేశారు.ఇందుకు నిరసనగా శుక్రవారం ఇంటర్మీడియట్ ఆర్‌జేడీ కార్యాలయం ఎదుట సీనియర్ అసిస్టెంట్ మునిచంద్ర ప్లకార్డులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తన రెగ్యులర్ స్థానమైన తిరుపతి డీవీఈఓ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ పోస్టును ఆరోపణలు ఎదర్కొంటున్న మరొకరికి ఇచ్చేందుకు అధికారులు చూస్తున్నారని ఆరోపించారు. అందుకోసమే తనపై విచారణ చేయకుండా ముందుగానే మరో చోటికి డిప్యూటేషన్‌పై పంపించారన్నారు. దీంతోపాటు మరో ఉద్యోగి ఎయిడెడ్ యాజమాన్యం నుంచి వచ్చినా నిబంధనలకు విరుద్ధంగా అతనికి తన రెగ్యురల్ స్థానాన్ని ఇచ్చేందుకు సిద్దమవుతున్నారని తెలిపారు. పలు ఆధారాలతో ఫిర్యాదు చేసిన అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఈ విషయంలో తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని హెచ్చరించారు. దీనిపై ఆర్‌జేడీ సురేష్‌బాబుతో మాట్లాడగా మునిచంద్రపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేసి కమిషనర్‌కు పంపించామన్నారు. కమిషనర్ ఆదేశాల మేరకే ఆతనిని పంపించినట్లు చెప్పారు. మిగతా వారిపై కూడా విచారణ చేసి కమిషనర్ కు నివేదించామని, ఆయన నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటామన్నారు.


