జాతీయస్థాయి పోటీలకు ఎంపిక
మదనపల్లె సిటీ : జాతీయస్థాయి అండర్–16 బాలికల ఫుట్‌బాల్ పోటీలకు మదనపల్లెకు చెందిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థిని తన్మయ ఎంపికయ్యారు. ఇటీవల నెల్లూరు జిల్లా నాయుడుపేటలో జరిగే రాష్ట్ర స్థాయి పుట్‌బాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి జట్టుకు ఎంపికై ంది. నవంబర్ 18వతేదీ నుంచి ఏపీ ఫుట్‌బాల్ అసోసియేషన్ అనంతపురం ఆర్‌డీటీలో నిర్వహించే జాతీయ స్థాయి బాలికల చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొంటుందని ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు దిలీప్‌కుమార్, మురళీధర్ తెలిపారు. తన్మయికి పుట్‌బాల్ అసోసియేషన ఉపాధ్యక్షులు జాన్ కమలేష్, సాగర్, సంయుక్త కార్యదర్శులు మహేంద్రనాయక్, క్రీడాభారతి కార్యదర్శి నరేష్ అభినందనలు తెలిపారు.


