పటేల్ స్ఫూర్తితో ముందుకు సాగాలి
కడప అర్బన్ : దేశ సమగ్రతను కాపాడిన ఉక్కు మనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్ అని, ఆయన సంకల్పాన్ని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా ఎస్.పి షెల్కే నచికేత్ విశ్వనాథ్ అన్నారు. శుక్రవారం ఉదయం కడప పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎస్పీ ’రన్ ఫర్ యూనిటీ’ పరుగును జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్.పి మాట్లాడుతూ భారతదేశాన్ని ఏకీకరణ చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రీ య ఏక్తా దివస్ కార్యక్రమాన్ని దేశ వ్యాప్తంగా పండుగ వాతావరణంలో నిర్వహించుకుంటున్నామన్నారు.
భరత జాతి ఔన్నత్యాన్ని
ప్రపంచానికి చాటిచెప్పాలి
కడప సెవెన్‌రోడ్స్ : భిన్నత్వంలో ఏకత్వం, సమైక్యత, సౌభ్రాతృత్వాలకు ప్రతీకగా వెలుగొందుతున్న భరత జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని పిలుపునిస్తున్నామని, అదే ‘ఏక్తా దివస్‘ ముఖ్య ఉద్దేశ్యమని డీఆర్వో విశ్వేశ్వర నాయుడు పేర్కొన్నారు. సర్ధార్ వల్లభాయి పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం కలెక్టరేట్‌లో రాష్ట్రీయ ‘ఏక్తా దివస్‘ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డీఆర్వో విశ్వేశ్వర నాయుడు, కలెక్టరేట్ అధికారులతో కలిసి సర్ధార్ వల్లభాయి పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో ముందుగా ‘దేశ ఐకమత్యం, సమగ్రత, భద్రతను కాపాడటానికి స్వయంగా అంకితమవుతానని, అంతేగాక ఈ సందేశాన్ని తోటివారందరిలో విస్తరింపచేయడానికి గట్టిగా కృషిచేస్తానని‘సభకు హాజరైన వారందరి చేత డిఆర్‌ఓ ప్రతిజ్ఞ చేయించారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటపతి, స్టెప్ సీఈఓ విజయ్ కుమార్, మెప్మా ిపీడీ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


