 
															కూటమి కళ్లకు గంతలు!
రోడ్డంతా గుంతలు.. 
అడుగుకో గుంతతో ప్రమాదం పొంచి ఉంది. ఏ రోడ్డు చూసినా గోతులతోనే దర్శనమిస్తోంది. కూటమి ప్రభుత్వం కొలువుదీరాక గుంతలు కనిపించవన్నారు.. కొన్నాళ్ల కిందటే రోడ్ల కోసం కోట్లు ఖర్చు చేశామని గొప్పలు చెప్పారు. కోట్లు ఖర్చు చేశారో.. ‘కోట్ల’ వెనక దాచారో గుంతలు పడ్డ ఈ రోడ్లను చూసే తెలుస్తుంది. పచ్చ కళ్లకు కట్టిన గంతలు తీసేస్తే గోతులు పడ్డ రోడ్డు కానొస్తుంది.అరకొరగా పనులు చేసి చేతులు దులుపుకోవడం తప్ప పూర్తి స్థాయిలో పనులు చేపట్టలేదని కడప నగర శివార్లలోని ప్రధాన రహదారిని చూస్తే అర్థమవుతుంది. ఈ రహదారుల్లో వెళ్లే ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మాటలు తప్పా చేసేదేమీ ఉండదని కూటమి నేతల తీరుపై తూర్పారబడుతున్నారు. – ఫొటోలు: సాక్షి, ఫొటోగ్రాఫర్, కడప
పాలెంపల్లె వద్ద అధ్వాన స్థితిలో రోడ్డు
దేవునికడప రోడ్డు వద్ద
ఫాతిమా కళాశాల వద్ద రింగ్‌రోడ్డులో
బచ్చుంపల్లె వద్ద భారీ గుంత
 
							కూటమి కళ్లకు గంతలు!
 
							కూటమి కళ్లకు గంతలు!
 
							కూటమి కళ్లకు గంతలు!

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
