 
															నేడు జాబ్‌మేళా
కడప కోటిరెడ్డిసర్కిల్: ఏపీఎస్‌ఎస్‌డీసీ, జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 9 గంటలకు కడపలోని ప్రభుత్వ ఐటీఐలో 13 కంపెనీలతో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి సురేష్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. 18–45 ఏళ్లలోపు కలిగిన అభ్యర్థులు 7, 10 తరగతులు, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లామా, బీటెక్ చదివిన వారు అర్హులన్నారు. అభ్యర్థులు తమ విద్యార్హతలకు సంబంధించిన ధ్రువపత్రాలు, ఫొటోలతో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు.
కడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వవిద్యాలయంలో నవంబర్ 7వ తేదీన అంతర కళాశాలల క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు ఆ విశ్వవిద్యాలయ వ్యాయామ విద్య, క్రీడా శాస్త్రాల బోర్డు కార్యదర్శి డాక్టర్ రామసుబ్బారెడ్డి తెలిపారు. రోలర్ స్కెటింగ్, రైఫిల్ షూ టింగ్, యోగ, టేబుల్ టెన్నిస్ విభాగాల్లో పోటీ లు ఉంటాయన్నారు. క్రీడాకారుల వయసు 17 నుంచి 25 ఏళ్లలోపు ఉండాలని సూచించారు. ఈ పోటీల్లో పాల్గొనదలచిన క్రీడాకారు లు ఒరిజినల్ స్టడీ సర్టిఫికేట్, టెన్త్, ఇంటర్, డిగ్రీ సర్టిఫికెట్‌లు, వీటిలో పాటు ఒక సెట్ జిరాక్స్ కాపీలపై ప్రిన్సిపల్‌తో అటెస్టేషన్ చేయించుకుని రావాలని పేర్కొన్నారు.
కడప ఎడ్యుకేషన్: యోగివేమన విశ్వ విద్యాలయ పరిధిలో జరగుతున్న బీఈడీ 3వ సెమిస్టర్ పరీక్షలను గురువారం యూనివర్సిటీ హైపర్ కమిటి సభ్యులు ఈశ్వరరెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పరీక్షా కేంద్రంలో వసతులతోపాటు విద్యార్థులను పరిశీలించారు. పరీక్ష తీరును పరిశీలించి సిబ్బందికి తగిన సూచనలు, సలహాలను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అబ్జర్వ ర్ దాసరిమోసే పాల్గొన్నారు. అలాగే విశ్వవిద్యాలయ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ కేఎస్‌వీ కృష్ణారావు పలు సెంటర్లను తనిఖీ చేశారు.
కడప వైఎస్సార్ సర్కిల్: ఈనెల 22,23న ఏలూరులో నిర్వహించిన ఎస్‌జీఎఫ్ అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటి జాతీయస్థాయికి ఎంపికై నట్లు డీఎస్‌డీఓ గౌస్ బాషా పేర్కొన్నారు. జిల్లా క్రీడాకారుడైన బి.సాయి 800 మీటర్లలో సిల్వర్ పథకం 400 మీటర్ల సిల్వర్ పథకం, రిలే బంగారు పతకం సాధించారన్నారు. ఏ.సాయి ప్రశాంత్ 1500 మీట ర్లలో కాంస్య పథకం, 400 మీటర్లలో రిలే బంగారు పతకం సాధించారన్నారు. వీరు నవంబర్ 27 నుంచి హర్యానాలో జరిగే జాతీయ స్థా యి పోటీలకు ఎంపికై నట్లు తెలిపా రు. అథ్లెటిక్స్ లో రాణించిన క్రీడాకారులను కోచ్ లు శివగంగా అభినందించారు.
మైదుకూరు: మోంథా తుపాను కారణంగా ఉద్యాన పంటలు దెబ్బతిని ఎంత మేరకు నష్టం వాటిల్లిందనే దానిపై అంచనా వేయనున్నట్లు జిల్లా ఉద్యాన శాఖ అధికారి సతీష్ పేర్కొన్నారు. గురువారం మండలంలోని వనిపెంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ బాలకృష్ణ, డాక్టర్ కాంతిశ్రీ, ఉద్యాన అధికారులు బి.శ్రీనివాస్ రెడ్డి, వి.రామకృష్ణ, ఉద్యాన సహాయకులతో కలిసి పలు మండలాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. మైదుకూరు, పోరుమామిళ్ల, కాశినాయన, బ్రహ్మంగారిమఠం మండలాల్లోని లింగందిన్నెపల్లె, చెంచయ్యగారిపల్లె, రామచంద్రాపురం, సావిశెట్టిపల్లె, కోడిగుడ్లపాడు గ్రామాల్లో మోంథా తుపాన్ వల్ల కురిసిన భారీ వర్షాలతో దెబ్బతిన్న అరటి, ఉల్లి, జామ, మిరప, వంగ, చామంతి పంటలను పరిశీలించి ఎంత మేరకు దెబ్బతిన్నాయి.. నష్టం ఏ స్థాయిలో ఉందనే విషయంపై అంచనా వేశారు. పంట నష్ట తీవ్రత ఎక్కువగా ఉన్నందున నష్టాన్ని అంచనా వేసి సంబంధిత శాఖలకు నివేదిక అందజేస్తామని తెలిపారు.
పంట నష్ట వివరాలను నమోదు చేయండి
కాశినాయన: మోంథా తుపాన్ వల్ల దెబ్బతిన్న ఉద్యాన పంటల నష్ట వివరాలను నమోదు చేయాలని జిల్లా ఉద్యాన అధికారి సతీష్ తెలిపారు. మండలంలోని పలు గ్రామాల్లో తు పాన్ వల్ల దెబ్బతిన్న ఉద్యాన పంటలను స్థానిక ఉద్యాన అధికారి శ్రీనివాసులరెడ్డితో కలసి ఆయన పరిశీలించారు.
 
							నేడు జాబ్‌మేళా

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
