పంటికింద రాయితీ! | - | Sakshi
Sakshi News home page

పంటికింద రాయితీ!

Oct 31 2025 7:47 AM | Updated on Oct 31 2025 7:51 AM

చిన్నపరిశ్రమలకు 2న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాక

చిన్నపరిశ్రమలకు

కడప సెవెన్‌రోడ్స్‌: నవంబర్‌ 2 తేదీ సీపీ బ్రౌన్‌ గ్రంథాలయంలో జరిగే బ్రౌన్‌ శాస్త్రి శతజయంతోత్సవ వేడుకలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రానున్న నేపథ్యంలో ప్రొటోకాల్‌ ప్రకారం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో అధికారిక ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జేసీ అదితి సింగ్‌, ఎస్పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జానమద్ది సాహితీ పీఠం ఆధ్వర్యంలో సీపీ బ్రౌన్‌ ప్రాంగణంలో నిర్వహించనున్న గ్రంథాలయ సాహిత్య సేవా పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొంటారని తెలిపారు. ఆయన బస చేయనున్న ఆర్‌అండ్‌బీ గెస్ట్‌ హౌస్‌ వద్ద మెడికల్‌ టీం ఏర్పాటు చేయాలని వైద్యాధికారులకు సూచించారు. అధికారులందరూ జానమద్ది సాహితీ పీఠం వారితో సమన్వయం చేసుకుంటూ, ప్రొటోకాల్‌ ప్రకారం అవసరమైన అన్ని ఏర్పాట్లను ఖచ్చితంగా పాటించాలని పేర్కొన్నారు.

కడప కార్పొరేషన్‌: ఓ సినిమాలో అడుక్కుంటున్న అలీకి బ్రహ్మానందం అర్థరూపాయి వేసి... తీసుకో.. పండుగ చేస్కో...అంటాడు. దీనికి ఏం పండుగ చేసుకోవాలి.. తొక్కలో అర్థరూపాయి వేసి ఏదో మా ఫ్యామిలీని పోషిస్తున్నట్లు ఫోజు ఇస్తున్నావేంటి.. అంటూ అలీ వెటకారంగా జవాబిస్తాడు. కూటమి ప్రభుత్వంలో పారిశ్రామిక ప్రోత్సాహకాల విడుదల విషయంలో అచ్చం ఇదే సీన్‌ రిపీట్‌ అవుతోంది. ప్రపంచమంతా ఏపీ వైపు చూస్తోంది...పారిశ్రామిక పెట్టుబడులకు ఏపీ స్వర్గధామం...ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ముందున్నాం. సింగిల్‌ డెస్క్‌ ద్వారా అన్ని రకాల వెనువెంటనే అనుమతులిస్తున్నామని గొప్పలు పోతూ విశాఖపట్నంలో సమ్మిట్‌ నిర్వహిస్తున్నారు. ఈ సమ్మిట్‌కు ముందు పారిశ్రామిక వేత్తలకు ఏదో చేశామని చెప్పుకునేందుకు దీపావళి కానుక పేరుతో రూ.1500 కోట్లు పారిశ్రామిక రాయితీలు ఇస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్భాటంగా ప్రకటించారు. తీరా చూస్తే అందులో రూ.1031 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మిగిలిన రూ.470 కోట్లను దారి మళ్లించారు.

● వైఎస్సార్‌ కడప జిల్లాలో 2004 ఎంఎస్‌ఎంఈ యూనిట్లు ఉంటే 156.51 కోట్లు ప్రోత్సాహకాలు రావాల్సి ఉంది. ప్రభుత్వం అందులో సగం రాయితీలనైనా ఇస్తుందని పారిశ్రామిక వేత్తలు ఆశించారు. కానీ తీరా ప్రోత్సాహకాలు విడుదలయ్యాక వారు అవాక్కయ్యారు. కేవలం నామమాత్రంగా నిధులు మాత్రమే విడుదలయ్యాయని తెలుసుకొని నవ్వాలో, ఏడవాలో తెలియక అయోమయంలో ఉన్నారు. మొత్తం 156.51 కోట్ల బకాయిల్లో కేవలం అతి తక్కువ శాతం రాయితీలు మాత్రమే ఇచ్చి ప్రభుత్వం పండుగ చేసుకోమంటోందని పారిశ్రామివేత్తలు వాపోతున్నారు. ఈ రాయితీలు కూడా ఏయే యూనిట్లకు ఎంతెంత ఇచ్చారనే వివరాలు మాత్రం ఎవరికీ తెలియదు. ప్రభుత్వం వైఖరి చూసి పారిశ్రామిక వర్గాలు విస్తుపోతున్నాయి.

ప్రోత్సాహకాలు ఎంతిచ్చారనేది తెలీదు

ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈలకు ఎంత మేర ప్రోత్సాహకాలు విడుదల చేసిందనేది మాకు తెలీదు. మేమైతే జాబితా సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించాం. కొందరు వచ్చాయంటున్నారు, కొందరు రాలేదంటున్నారు. సాధా రణంగా ఎంతమందికి ప్రోత్సాహకాలు ఇచ్చా రో జాబితా రావాలి. ఇంకా రాలేదు. – చాంద్‌బాషా,

జనరల్‌ మేనేజర్‌, జిల్లా పరిశ్రమల కేంద్రం

ప్రొటోకాల్‌ మేరకు ఏర్పాట్లు చేయాలి

కలెక్టర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి ఆదేశం

జిల్లాలో 2004 ఎంఎస్‌ఎంఈలకు రూ.156.51కోట్ల బకాయిలు

జిల్లాకు నామమాత్రంగారాయితీలు విడుదల

విస్తుపోతున్న పారిశ్రామిక వర్గాలు

పంటికింద రాయితీ! 1
1/2

పంటికింద రాయితీ!

పంటికింద రాయితీ! 2
2/2

పంటికింద రాయితీ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement