
ఎల్లలు దాటిన అభిమానం
కడప కార్పొరేషన్ : కువైట్ దేశంలో దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్.రాజశేఖర్‌రెడ్డి జయంతి ఘనంగా నిర్వహించారు. మంగళవారం రాత్రి ఖైతాన్ ప్రాంతంలో ఉన్న రాజధాని రెస్టారెంట్‌లో వైఎస్సార్‌సీపీ కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి ఒకరినొకరు పంచుకున్నారు. కువైట్ కన్వీనర్ బాలిరెడ్డి, గల్ఫ్ కోకన్వీనర్ గోవిందు నాగరాజు మాట్లాడుతూ డా. వైఎస్సార్ తన పరిపాలనలో పేద బడుగు బాలహీన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేశారని, పేదలకు ఆరోగ్యశ్రీ, రైతులకు రుణమాఫీ, ఉచిత విద్యుత్ పథకం, తదితర పథకాలు ప్రవేశపెట్టి పేదలకు అండగా నిలిచారన్నారు. తెలుగు ప్రజల గుండెల్లో రాజన్న శాశ్వతంగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గల్ఫ్ కోర్ కమిటీ సభ్యులు ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి, ఎం.చంద్రశేఖర్‌రెడ్డి, కె.రమణయాదవ్, మర్రి కళ్యాణ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మాదిరి తాము రెడ్‌బుక్ తరహాలో రాయగలమని, అది తమ సంస్కృతి కాదన్నారు. ఇప్పటికై నా మంత్రి లోకేష్ రెడ్‌బుక్ పాలన ప్రక్కన పెట్టి డాక్టర్ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని గౌరవించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు లక్ష్మీప్రసాద్, షేక్ రహంతుల్లా, షేక్ గఫార్, షాహుస్సేన్, ఎ.బాలక్రిష్ణారెడ్డి, గోవిందురాజు, అప్సర్‌అలీ, అన్నాజీ, వెంకటక్రిష్ణ, ఉపాసన, వెంకటరమణారెడ్డి, షేక్ గఫార్, నరసారెడ్డి, పి.సురేష్‌రెడ్డి, అబూతురాబ్ పాల్గొన్నారు.
ఖతార్‌లో వైఎస్సార్ జయంతి
ఖతార్ దేశంలోని దోహా పట్టణంలో దివంగత మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి జయంతి వేడుక ఘనంగా జరిగింది. స్థానిక తాజ్ మహారాజ హోటల్‌లో వైఎస్సార్‌సీపీ ఖతార్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి ఖతార్ వైఎస్సార్‌సీపీ కన్వీనర్ దొండపాటి శశికిరణ్ ఆధ్వర్యంలో రాజశేఖరరెడ్డి చిత్ర పటానికి పూలమాల వేసి, కేక్ కట్ చేసి నివాళులర్పించారు. శశికిరణ్ మాట్లాడుతూ రాజన్న భౌతికంగా తమ మధ్య లేకపోయినా, తమ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. వైఎస్సార్ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన వైఎస్.జగన్మోహన్‌రెడ్డి నవరత్నాలు అమలు చేసి అద్భుతపాలన సాగించారన్నారు. కార్యక్రమంలో గల్ఫ్ ప్రతినిధి వర్జిల్‌బాబు, వైఎస్సార్‌సీపీ ఖతార్ కమిటీ కో కన్వీనర్లు జాఫర్ హుస్సేన్, ఆరోన్ మనీష్, ఎన్.నాగేశ్వరరావు, జయరాజు, ఎన్.లియోపోల్డ్‌కింగ్, టి.అరుణ్‌కుమార్, హేమంత్, గణేష్, శివనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
కువైట్‌లో ఘనంగా మహానేత జయంతి

ఎల్లలు దాటిన అభిమానం