ఉత్సాహంగా అండర్–19 వన్డే క్రికెట్ టోర్నీ
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏసీఏ సౌత్ జోన్ అండర్ –19 వన్డే క్రికెట్ టోర్నమెంట్ ఉత్సాహంగా కొనసాగింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో అనంతపురం జట్టుపై 7 వికెట్ల తేడాతో చిత్తూరు జట్టు ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన అనంతపురం జట్టు 55.0 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. ఆ జట్టులోని భువనేశ్వర్ 65, జయంత్ కృష్ణ 41 పరుగులు చేశారు. చిత్తూరు జట్టులోని చరణ్ 3, ప్రకాష్ రాజ్ 3 వికెట్లు తీసుకున్నారు. అనంతరం 230 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన చిత్తూరు జట్టు 33.4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ జట్టులోని లోహిత్ లక్ష్మి నారాయణ అద్భుతంగా బ్యాటింగ్ ప్రదర్శించాడు. 104 బంతులను ఎదుర్కొని 17 బౌండరీలు, 2 సిక్సర్ల సహాయంతో 125 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. వేదాంత్ 32 పరుగులు చేశాడు.
36 పరుగుల తేడాతో కడప జట్టు విజయం
కెఎస్‌ఆర్‌ఎమ్ క్రికెట్ మైదానంలో జరిగిన వేరొక మ్యాచ్‌లో నెల్లూరు జట్టుపై 36 పరుగుల తేడాతో కడప జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన కడప జట్టు 48.4 ఓవర్లలో 243 పరుగులకు అన్ని వికెట్లు కోల్పోయింది. ఆ జట్టులోని రణధీర్ రెడ్డి 65, ఆర్దిత్ రెడ్డి 61 (నాటౌట్) పరుగులు చేశారు. నెల్లూరు జట్టులోని భార్గవ్ మహేష్ 3, తోషిత్ యాదవ్ 2 వికెట్లు తీసుకున్నారు. అనంతరం 244 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన నెల్లూరు జట్టు 37.5 ఓవర్లలో 207 పరుగులకు అన్ని వికెట్లు కోల్పోయి ఓటమి చవిచూసింది. ఆ జట్టులోని తోషిత్ యాదవ్ 77, మన్విత్ 38 పరుగులు చేశారు. కడప జట్టులోని ఆర్దిత్ రెడ్డి 2, ధీరజ్ కుమార్ రెడ్డి 2, హృతిక్ రెడ్డి 2 వికెట్లు తీసుకున్నారు.
ఉత్సాహంగా అండర్–19 వన్డే క్రికెట్ టోర్నీ
ఉత్సాహంగా అండర్–19 వన్డే క్రికెట్ టోర్నీ


