
● సంసిద్ధంగా లేని స్టూడెంట్స్ కిట్స్
గతంలో పాఠశాలలు పునః ప్రారంభం అంటేనే పుస్తకాలు, కిట్స్ రెడీగా ఉండేవి. ఈమారు కూటమి సర్కార్కు ముందు చూపు లేకపోవడంతో విద్యార్థులకు పంపిణీ చేసేందుకు స్టూడెంట్స్ కిట్స్ అందుబాటులో లేవని పలువురు వాపోతున్నారు. మరోవైపు అయ్యవార్ల బదిలీలు పెండింగ్లో ఉన్నాయి. ఇంకో వైపు నాడు–నేడు పనులు నిలిచిపోయి తరగతి గదులు, టాయిలెట్స్ అసంపూర్తిగా ఉన్నాయి. విద్యార్థులు సురక్షిత మంచినీరు తాగేందుకు ఆర్వో ప్లాంట్స్ అస్తవ్యస్తంగా ఉన్నాయి. చాలా పాఠశాలలల్లో నిర్వహణ లేకపోవడంతో మరుగున పడ్డాయి. గ్రామీణ విద్య పట్ల, మరీ ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల పట్ల సర్కారుకు చిత్తశుద్ధి లేకపోవడంతోనే ఇలాంటి ముందుచూపు కొరవడిందని విద్యావేత్తలు వివరిస్తున్నారు.