
మత్స్యశాఖ ఏడీగా నాగయ్య
కడప అగ్రికల్చర్: మత్స్యశాఖ ఏడీగా నాగయ్య నియమితులయ్యారు. ఆయన విజయవాడ హెడ్ ఆఫీస్ నుంచి వైఎస్సార్ జిల్లా ఏడీగా కడపకు వచ్చారు. ఇక్కడ ఏడీగా పని చేస్తున్న రెడ్డెయ్యను నంద్యాలకు బదిలీ చేశారు.
డీసీఓగా వెంకటసుబ్బయ్య..
జిల్లా సహకారశాఖ అధికారిగా వెంకటసుబ్బయ్య నియమితులయ్యారు. ఈయన నంద్యాల జిల్లా నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చారు. అలాగే ప్రొద్దుటూరులోని జిల్లా సహకార శిక్షణా కేంద్రం అధ్యాపకుడిగా ఎన్‌టీఆర్ జిల్లాలో పని చేసే శ్రీనివాసులరెడ్డి నియమితులయ్యారు.
దరఖాస్తుల ఆహ్వానం
కడప కోటిరెడ్డిసర్కిల్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు కొత్తగా ఏర్పడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాల హక్కుల పరిరక్షణ కమిషన్‌లో చైర్‌పర్సన్, సభ్యుల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఐసీడీఎస్ పీడీ దేవిరెడ్డి శ్రీలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. చైర్మన్‌తోపాటు మొత్తం ఆరుగురు సభ్యుల నియామకానికి దరఖాస్తులను కోరుతున్నారన్నారు. మరిన్ని వివరాలకు 9440814416 నెంబరులో కార్యాలయ పని వేళల్లో సంప్రదించాలన్నారు.
జిల్లా వ్యవసాయ
అధికారిగా చంద్రానాయక్
కడప అగ్రికల్చర్: జిల్లాలో ఉద్యోగుల బదిలీల పరంపర కొనసాగుతుంది. బదిలీల్లో భాగంగా వైఎస్సార్ జిల్లా వ్యవసాయ అధికారిగా చంద్రానాయక్ నియమితులయ్యారు. ఈయన అన్నమయ్య జిల్లా డీఏఓగా పని చేస్తూ వైఎస్సార్ జిల్లాకు బదిలీపై వచ్చారు. వైఎస్సార్ జిల్లా డీఏఓగా పని చేస్తున్న అయితా నాగేశ్వరావు గుంటూరు డీఏఓగా బదిలీపై వెళ్లారు. అలాగే జిల్లా లోని పలువురు ఏడీలతోపాటు ఏవోలు కూడా జి ల్లాలోని పలు ప్రాంతాలకు బదిలీలు అయ్యారు.
జిల్లా ఉద్యానశాఖ అధికారిగా..
జిల్లా ఉద్యానశాఖ అధి కారి రవిచంద్ర బాబు నియమితులయ్యారు. ఈయన కూడా అన్నమయ్య జిల్లా ఉద్యానశాఖ అధికారిగా పని చేస్తూ వైఎస్సార్ జిల్లాకు బదిలీపై వచ్చారు. ఇక్కడ ఉద్యానశాఖ అధికారిగా పని చేస్తున్న సుభాషిణి అన్నమయ్య జిల్లా ఉద్యానశాఖ అధికారిగా బదిలీపై వెళ్లారు. వీరితోపాటు జిల్లాలోని పలువురు మండల ఉద్యానశాఖ అధికారులు పలు మండలాలకు బదిలీ అయ్యారు. వీరితోపాటు జిల్లా హెడ్‌ఆఫీస్‌లో జిల్లా టెక్నికల్ హెచ్‌ఓగా పని చేస్తున్న జోతిర్మయి రాష్ట్ర హెడ్‌ఆఫీస్‌కు బదిలీకాగా ఆమె స్థానంలో హెడ్‌ఆఫీస్‌లో పని చేస్తున్న జీవన్ వస్తున్నారు.
మార్కెటింగ్‌శాఖలో..
మార్కెటింగ్‌శాఖ డీడీగా లావణ్య బదిలీపై వచ్చారు. కడప మార్కెటింగ్‌శాఖ డీడీగా గతంలో పని చేస్తున్న శ్రీకాంత్‌రెడ్డిని కడప మార్కెట్‌యార్డు సెక్రటరీగా నియమించారు.

మత్స్యశాఖ ఏడీగా నాగయ్య