అల్లుడి హత్య కేసులో మామ, మరో ముగ్గురి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

అల్లుడి హత్య కేసులో మామ, మరో ముగ్గురి అరెస్టు

Jun 9 2025 6:59 AM | Updated on Jun 9 2025 6:59 AM

అల్లుడి హత్య కేసులో మామ, మరో ముగ్గురి అరెస్టు

అల్లుడి హత్య కేసులో మామ, మరో ముగ్గురి అరెస్టు

కడప అర్బన్‌ : కడప చిన్న చౌక్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అశోక్‌ నగర్‌లో జూన్‌ 1వ తేదీన సయ్యద్‌ చాంద్‌ బాషా అనే యువకుడిని తాళ్లతో కట్టేసి క్రూరంగా హత్య చేసిన కేసులో మృతుడి మామతో పాటు భార్య , అత్త, బావమరిదిని అరెస్టు చేశారు. మరొక బావమరిదిని జువైనల్‌ హోంకు పంపినట్లు చిన్న చౌక్‌ సీఐ జి.ఓబులేసు తెలిపారు. కడప చిన్నచౌక్‌ పోలీస్‌ స్టేషన్‌లో సీఐ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హత్య కేసు వివరాలు వెల్లడించారు. చాంద్‌ బాషా అలియాస్‌ చాను హత్య అనంతరం పారిపోయిన నిందితులపై నిఘా ఉంచారు. ఆదివారం సాయంత్రం వాటర్‌ గండి వద్ద అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుల వద్ద నుంచి రెండు మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అరెస్ట్‌ అయిన వారిలో మృతుడి మామ షేక్‌ మహబూబ్‌ బాషా , భార్య ఆయేషా, అత్త షేక్‌ ప్యారి, బావమరిది షేక్‌ మొహమ్మద్‌ రఫీ ఉన్నారు. ఈ కేసులో మరొక బావమరిది బాలుడు కావడంతో అతనిని జువైనల్‌ హోమ్‌ కు తరలించినట్లు సీఐ తెలిపారు. మృతుడికి ముగ్గురు సంతానమని తెలిపారు. 2016 ఆగస్టు 25న ఆయేషాతో వివాహం కాగా ఆ తర్వాత వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయన్నారు. దీంతో ఆయేషా గతంలో మృతుడిపై ఫిర్యాదు చేయడంతో గృహ హింస కేసు కూడా నమోదు చేశారు. రామకృష్ణ నగర్‌లో ఆయేషా పేరు మీద ఉన్న రేకుల షెడ్డును మృతుడు ఇతరులకు అమ్మడంతో మనస్పర్థలు తీవ్రమయ్యాయి. ఈ కారణంగా ఆయేషా కుటుంబ సభ్యులు అతన్ని చంపాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో అశోక్‌ నగర్‌లో రసూల్‌ అనే వ్యక్తి ఇంటిలో శుభ కార్య ఉండగా అక్కడికి వస్తాడని తెలుసుకొని పథకం రచించారు. ఆ ప్రకారం వేచి చూసి రసూల్‌ ఇంటి దగ్గర నుంచి రోడ్డు మీదకు రాగానే అక్కడే వేచి ఉన్న నిందితులు చాన్‌బాషాను మెడ పట్టుకుని బలవంతంగా ఇంటిలోనికి తీసుకెళ్లి, రెండు చేతులు కాళ్లు కట్టేశారన్నారు. ఆ తర్వాత ఇంటిలోకి ఎవరిని రానీకుండా అడ్డుకొని బలమైన మచ్చు కత్తితో చాంద్‌బాషాను అతి ఘోరంగా మెడ మీద ఐదు చోట్ల బలంగా నరకడంతో అక్కడికక్కడే మరణించాడు. ఈ హత్య కేసులోనిందితులను అరెస్టు చేసిన చిన్న చౌక్‌ సీఐ ఓబులేసు, ఎస్‌ఐ రాజరాజేశ్వర్‌ రెడ్డి హెడ్‌ కానిస్టేబుల్‌ వేణుగోపాల్‌, శివకుమార్‌, కానిస్టేబుళ్లు శ్రీనివాసులు, ఖాదర్‌బాషా ,నాగరాజు, మాధవరెడ్డి, మహిళా కానిస్టేబుల్‌ శ్రీదేవి, మహిళా హోంగార్డు జి.ప్రభావతిలను కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు అభినందించినట్లు సీఐ తెలిపారు. వీరికి రివార్డుల కోసం సిఫార్సు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

జువైనల్‌ హోంకు ఒకరి తరలింపు

కడప చిన్న చౌక్‌ సీఐ ఓబులేసు వెల్లడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement