చిత్తూరు,అనంతపురం జట్ల విజయ ఢంకా
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆ ధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏసీఏ సౌత్ జోన్ అండర్ – 23 వన్డే క్రికెట్ టోర్నీ చిత్తూరు, అనంతపురం జట్లు వి జయ ఢంకా మోగించాయి. గురువారం వైయస్ రాజా రెడ్డి ఏసీఏ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో నెల్లూరు జట్టుపై చిత్తూరు జట్టు 94 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన చిత్తూరు జట్టు 50.0 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. ఆ జట్టులోని లోహిత్ లక్ష్మీనారాయణ అద్భు తంగా బ్యాటింగ్ ప్రదర్శించాడు. 102 బంతులను ఎ దుర్కొని 10 బౌండరీలు, 3 సిక్సర్ల సహాయంతో 112 పరుగులు (సెంచరీ) చేశాడు. నికిత్ గౌడ్ 60 పరుగులు చేశాడు. నెల్లూరు జట్టులోని మాధవ్ 3 వికెట్లు తీసుకున్నాడు. అనంతరం 297 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన నెల్లూరు జట్టు 42.2 ఓవర్లలో 202 పరుగులకు అన్ని వికెట్లు కోల్పోయి ఓటమి చవిచూసింది. ఆ జట్టులోని మన్విత్ రెడ్డి 52, అర్జున్ 37 పరుగులు చేశారు. చిత్తూరు జట్టులోని బాలాజీ 4, రెడ్డి ప్రకాష్ 3 ముఖేష్ 2 వికెట్లు తీసుకున్నారు.
కేఎస్‌ఆర్‌ఎం మైదానంలో...
కేఎస్‌ఆర్‌ఎం క్రికెట్ మైదానంలో జరిగిన వేరొక మ్యాచ్‌లో కర్నూలు జట్టుపై 3 వికెట్ల తేడాతో అనంతపురం జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కర్నూలు జట్టు 38.1 ఓవర్లలో 196 పరుగులకు అన్ని వికెట్లు కోల్పోయింది. ఆ జట్టులోని నయీముల్లా 59, కనీష్ 51 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని మల్లికార్జున 4, దీపక్ 2, షేక్ కామిల్ 2 వికెట్లు తీసుకున్నారు. అనంతరం 197 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన అనంతపురం జట్టు 34.4 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసి 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ జట్టులోని మహేంద్ర రెడ్డి 67, అర్జున్ టెండూల్కర్ 40 పరుగులు చేశారు. కర్నూలు జట్టులోని కనిష్ 3, సాబ్జాన్ బాషా 2 వికెట్లు తీసుకున్నారు.
చిత్తూరు,అనంతపురం జట్ల విజయ ఢంకా
చిత్తూరు,అనంతపురం జట్ల విజయ ఢంకా
చిత్తూరు,అనంతపురం జట్ల విజయ ఢంకా


