
50 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం
దువ్వూరు : అక్రమంగా తరలిస్తున్న 50 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ వినోద్ కుమార్ తెలిపారు. మంగళవారం ఎర్రబల్లె క్రాస్ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేపట్టామన్నారు. బొలెరో వాహనంలో తరలిస్తున్న 50 బస్తాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నామని, విచారించగా రేషన్ బియ్యాన్ని దువ్వూరుకు చెందిన మారుగాని సురేంద్ర కొనుగోలు చేసి, అమ్ముతున్నట్లు తెలిసిందన్నారు. పంచాయతీ అధికారుల సమక్షంలో పంచనామా చేశామని, 50 బస్తాల రేషన్ బియ్యం మొత్తం విలువ రూ.1,10,400 ఉంటుందని వివరించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ పేర్కొన్నారు.